ముంబైలోని మలాడ్ ప్రాంతంలో కురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో, తల్లిదండ్రులు మంచం మీద నిద్రపోతున్న అదే గదిలో, తమ్ముడితో కలిసి నేలపై పడుకుని నిద్రపోతున్నట్లు నటిస్తూ అర్ధరాత్రి ఓ అక్క చేసిన అసహ్యకరమైన, దారుణమైన చర్య వెలుగులోకి వచ్చి పోలీసులనే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తోబుట్టువుల బంధం పవిత్రతనే మలినం చేసేలా, తమ్ముడిని బెదిరించి పాల్పడిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం, అసహ్యం రేకెత్తించింది. రోజూ రాత్రి సమయంలో తల్లిదండ్రులు గదిలోని మంచంపై నిద్రపోగా, ఈ బాలుడు, అతని అక్క కింద పడుకోవడం అలవాటుగా ఉండేది.
దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ యువతి, అర్ధరాత్రి తల్లిదండ్రులు గాఢ నిద్రలోకి జారుకున్న సమయం చూసి, తన తమ్ముడి పట్ల అసభ్యకరంగా, తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. భయపడిన బాలుడు దీనిని ఎదిరించినప్పుడు, “ఈ విషయం బయట ఎవరికైనా చెబితే నిన్ను ప్రాణాలతో వదలను” అని బెదిరిస్తూ తన దారుణ చర్యను కొనసాగించింది.
రోజులు గడిచేకొద్దీ, అక్క పెడుతున్న ఈ చిత్రహింసలను తట్టుకోలేక తీవ్ర మానసిక క్షోభకు గురైన బాలుడు, ధైర్యం తెచ్చుకుని జరిగిన దారుణాలన్నింటినీ తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పేశాడు. ఇది విని షాకైన తల్లిదండ్రులు, వెంటనే కురార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బాలుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరానికి ఆ యువతిపై పోక్సో (POCSO) చట్టంతో సహా కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారు. సొంత ఇంట్లోనే జరిగిన ఈ గుండెలు గుభేల్మనే ఘటన ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply