మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మొబైల్లో మాట్లాడుతూ వెళ్తున్న 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని రైలు ఢీకొని దుర్మరణం పాలైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని ఇచల్కరంజికి (Ichalkaranji) చెందిన అనుష్క సంతోష్ పవార్‌గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి హత్కణంగలే (Hatkanangale) ప్రాంతానికి వచ్చినప్పుడు, రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తోంది.
ఆ సమయంలో అనుష్క చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో తీవ్రంగా మాట్లాడుతూ నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన ‘ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్’ రైలు శబ్దం ఆమెకు వినిపించలేదు.
సమీపంలోకి వచ్చిన రైలును చూసి షాకైన ఆమె స్నేహితురాళ్లు ‘పక్కకు తప్పుకో’ అని గట్టిగా అరుస్తూ హెచ్చరించినప్పటికీ, చెవిలో ఇయర్‌ఫోన్స్ ఉండటం వల్ల ఆ అరుపులు అనుష్కకు వినిపించనేలేదు. వారు చూస్తుండగానే రైలు ఆమెను బలంగా ఢీకొట్టింది.
రైలు ఢీకొనడంతో ఎగిరిపడిన ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply