జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ కరణ్‌జీత్ అలియాస్ గుగాను 7 నెలల సుదీర్ఘ గాలింపు తర్వాత ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆర్ఎస్ పురా (RS Pura) జువైనల్ హోం (బాల నేరస్థుల పరిశీలనా గృహం) నుంచి ఇద్దరు పాకిస్థానీ ఖైదీలతో కలిసి అతడు పరారైనట్లు చెబుతున్నారు. తప్పించుకునే క్రమంలో భద్రతా విధుల్లో ఉన్న సిబ్బందిపై తుపాకీతో కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం వెలువడింది.
గుగాతో పాటు పరారైన ఇద్దరు పాకిస్థానీ ఖైదీలను ఆ తర్వాత పోలీసులు హర్యానాలో అరెస్టు చేశారు. వారు అంబాలా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. వారి పేర్లు మహ్మద్ సనావుల్లా, అహ్సాన్ అన్వర్‌గా గుర్తించారు. వీరిలో ఒకరు 2019లో, మరొకరు 2021లో ఆర్ఎస్ పురా జువైనల్ హోంలో ఖైదీలుగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
జైలు నుంచి తప్పించుకునేందుకు గుగానే ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా, వారిద్దరినీ ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదుగా నేపాల్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి విదేశాలకు పంపేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. దీంతో గుగాను పట్టుకునేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో గుగా ఢిల్లీలో నక్కినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అతడిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని కస్టడీలోకి తీసుకుని, జైలు నుంచి తప్పించుకున్న ఘటన, ఇద్దరు పాక్ ఖైదీలను విదేశాలకు పంపేందుకు వేసిన ప్లాన్‌కు సంబంధించిన వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరపనున్నారు.

Leave a Reply