“ఒక్క బైక్‌పై ఆరుగురు.. మరొకడు భుజాలపై ఎక్కి!” – రోడ్డుపై విద్యార్థుల భయంకరమైన స్టంట్లు.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న దృశ్యాలు..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో, ఒకే అవెంజర్ మోటార్ సైకిల్‌పై ఆరుగురు విద్యార్థులు అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటపడి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఆ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి తీసిన ఈ వీడియోలో, బైక్ సామర్థ్యానికి మించి ఆరుగురు కూర్చోవడమే కాకుండా, ఒక విద్యార్థి మరో విద్యార్థి భుజాలపై ప్రమాదకరంగా కూర్చుని ప్రయాణిస్తుండటం స్పష్టంగా రికార్డయ్యింది. అంతేకాకుండా, ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఒక్కరు కూడా హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం.

మీరట్ నెహ్రూ రోడ్డులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ వెనుక భాగంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఇతర వాహనాలు వెళ్తుండగానే, ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి విద్యార్థులు ఇలా ప్రాణాలను పణంగా పెట్టి స్టంట్లకు పాల్పడ్డారు. హఠాత్తుగా బ్రేక్ వేసినా లేదా ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినా, బైక్ సమతుల్యత కోల్పోయి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందనే స్పృహ కూడా లేకుండా విద్యార్థులు ఈ రకంగా ప్రమాదకరంగా ప్రయాణించారు.

ఈ ప్రమాదకర ప్రయాణం వల్ల బైక్‌పై వెళ్తున్న విద్యార్థుల ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే ఇతర ప్రజల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కాటుచిచ్చులా వ్యాపిస్తుండటంతో, ప్రమాదకర రీతిలో బైక్ నడిపిన విద్యార్థులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *