“రెండేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం..! కానీ ఇప్పుడు అకస్మాత్తుగా నన్ను వదిలేసింది..” పట్టపగలు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విలవిలలాడిన యువతి.. గంటన్నరలో బయటపడిన అసలు నిజం..!!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలోని కలెక్టరేట్ గేటు సమీపంలో, పట్టపగలు స్కూటీపై వెళ్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, వేగంగా స్పందించిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.

సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన స్కూటీపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ అనూహ్య దాడితో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ యువతి కేకలు వేస్తూ విలవిలలాడింది. అదృష్టవశాత్తూ, ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు.

పోలీసుల విచారణలో అరెస్టయిన నిందితుడు సాగర్ అలియాస్ సూరజ్ జాదవ్ అని తేలింది. బాధితురాలు, సాగర్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ యువతి అతనితో మాట్లాడటం పూర్తిగా మానేసింది. దీంతో ఆగ్రహానికి గురైన సాగర్, సెప్టెంబర్ 24న ఉదయం ఆమెను దారిలో అడ్డగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడిందని పోలీసు అధికారులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. విస్తృత గాలింపు చర్యల అనంతరం, కేవలం గంటన్నర వ్యవధిలోనే రహస్యంగా దాక్కున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ప్రేమ విఫలమైందన్న ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరலించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *