దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ , దుకాణంలోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన భయానక కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.
జోహన్నెస్‌బర్గ్ నగరంలోని ఓ ప్రముఖ నైట్ క్లబ్‌లోకి, అలాగే కేప్ టౌన్ నగరంలోని ఓ దుకాణంలోకి ఆయుధాలతో చొరబడిన దుండగుల ముఠా.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.
ఈ రెండు వేర్వేరు దాడుల్లో 27 మంది ఘటనా స్థలంలోనే విలవిలలాడుతూ ప్రాణాలు విడవగా, తీవ్రంగా గాయపడిన మరో 26 మందిని చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని, క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దాడికి పాల్పడి పరారైన సాయుధ దుండగుల ముఠాను పట్టుకునేందుకు దక్షిణాఫ్రికా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply