చూస్తుంటేనే అసహ్యంగా ఉంది..! “పట్టపగలే రైల్వే స్టేషన్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన”.. ఫోన్‌లో అలా మాట్లాడుతూ హద్దులు మీరిన ఆకతాయి.. ధైర్యంగా వీడియో తీసి బయటపెట్టిన యువతి..!

అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వేచి ఉన్న ఓ యువతి పట్ల ఓ వ్యక్తి నిరంతరం అసభ్యకరమైన సైగలు చేస్తూ వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతోంది.

గున్‌గున్ దత్తా అనే యువతి తన బంధువును సాగనంపేందుకు కామాఖ్య రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. రైలు కోసం అరగంట పాటు వేచి ఉన్న సమయంలో, బూడిద రంగు చొక్కా, గోధుమ రంగు నిక్కరు ధరించిన ఓ వ్యక్తి.. నిరంతరం వారివైపు తదేకంగా చూస్తూ, ఫోన్‌లో మాట్లాడుతూనే అసభ్యకరమైన మాటలు గొణిగాడు.

ఆ వ్యక్తి ప్రవర్తన హద్దులు మీరడంతో, గున్‌గున్ దత్తా తన మొబైల్ ఫోన్ తీసి అతడిని వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది. మొబైల్ కెమెరాను చూడగానే ఆ వ్యక్తి అక్కడి నుండి జారుకున్నాడు.

రైలు స్టేషన్‌లోకి రాగానే ఆ యువతి తన బంధువుతో కలిసి రైలు ఎక్కింది. అయితే, ఆ వ్యక్తి మళ్లీ అక్కడికి వచ్చి, వీరు ఉన్న రైలు బోగీలోనే ఎక్కాడు. యువతి వీడియో తీయడం కొనసాగించడాన్ని గమనించి, మళ్లీ కిందకు దిగి ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి అసభ్యకరమైన సైగలు చేసినట్లు తెలుస్తోంది.

ఆ యువతి ఈ ఘటన మొత్తాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోగా పోస్ట్ చేస్తూ, “రైల్వే స్టేషన్లలో మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొంది” అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ, అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం, అస్సాం పోలీస్ శాఖలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

“బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ధైర్యంగా వీడియో తీసిన ఆ యువతికి అభినందనలు! రైల్వే పోలీసులు తక్షణమే ఆ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి” అని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *