ఇకపై ఏడాదికి 12 సార్లు మాత్రమే..! 28 రోజుల రీఛార్జ్‌కు చెక్ పెట్టిన ట్రాయ్ (TRAI).. ఇకపై 30 రోజుల ప్లాన్ మాత్రమే.. టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు.. ఎంపీ రాఘవ్ చద్దా హర్షం..!!!!

నెలవారీ రీఛార్జ్ ప్లాన్ పేరుతో కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తున్న టెలికాం కంపెనీల విధానానికి స్వస్తి పలికేలా, భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) సవరించిన కొత్త వినియోగదారుల భద్రతా నిబంధనలను ప్రకటించింది.

ఈ చర్యపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు.

ట్రాయ్ విడుదల చేసిన కొత్త టెలికాం వినియోగదారుల భద్రతా నిబంధనలు-2026 ప్రకారం, ఇకపై అన్ని టెలికాం కంపెనీలు తప్పనిసరిగా 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలి.

ఇప్పటివరకు 28 రోజుల ప్లాన్‌ల వల్ల వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను ఎంచుకోవడం ద్వారా ఏడాదికి 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా, ప్రతి నెలా ఒకే నిర్దిష్ట తేదీన రెన్యువల్ చేసుకునే విధంగా ప్రత్యేక ప్లాన్‌ను కూడా కంపెనీలు ప్రవేశపెట్టాలి.

ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా, కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ (SMS) సేవలను మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం తక్కువ ధరకే ప్రత్యేక రీఛార్జ్ వోచర్లను ప్రవేశపెట్టాలని కూడా టెలికాం కంపెనీలను ఆదేశించింది.

గత మార్చి 11న పార్లమెంటులో 28 రోజుల వ్యాలిడిటీ విధానంపై ప్రశ్నించిన రాఘవ్ చద్దా, ఈ కొత్త నిబంధనలపై సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈ మార్పు ముఖ్యంగా ఇంటర్నెట్ ఉపయోగించని సామాన్య ప్రజలకు, తక్కువ బడ్జెట్‌లో రీఛార్జ్ కోరుకునే వారికి ఎంతో ఊరటనిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. గత ఏప్రిల్ 2026లో ప్రారంభమైన సంప్రదింపుల సమావేశాలు, 1,000కి పైగా సంస్థల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ట్రాయ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *