హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ రెడ్డి కాలనీలో ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను, కలకలాన్ని రేపింది.
శ్రీనివాస్‌గా గుర్తించిన ఆ వ్యక్తి, మద్యం మత్తులో తన సొంత కూతురితోనే అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తండ్రి చేసిన ఈ పైశాచిక చేష్టలకు భయపడిపోయిన ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చిన ఆమె తల్లి రమ, తన కూతురిని కాపాడుకోవడానికి గొడ్డలితో శ్రీనివాస్‌పై తీవ్రంగా దాడి చేసింది.
ఈ ఆకస్మిక దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కుటుంబ సభ్యులను లోతుగా విచారిస్తున్నారు. గృహహింస, మద్యం మత్తు కారణంగా జరుగుతున్న ఇటువంటి దారుణాలు సమాజంలో తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా, ప్రజలను, బంధువులను ఆలోచింపజేస్తున్నాయి.
కూతురి రక్షణ కోసమే తల్లి తన భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ, దీని వెనుక ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును

Leave a Reply