సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లలో ‘మై లైఫ్ మై రూల్స్’ కాన్సెప్ట్‌తో వచ్చే ఫన్నీ వీడియోలకు నెటిజన్ల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది.
తాజాగా, చూడటానికి ఒక చిన్న ఆటో రూపంలో ఉన్న విచిత్రమైన ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలన్నీ బారులు తీరి ఉండగా, ఆ ఆటో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాహనం దిగాడు.
తాను నడుపుతున్న ఆ తక్కువ బరువున్న బుల్లి ఆటో బైక్‌ను ఏమాత్రం శ్రమ లేకుండా చేతులతో ఎత్తుకుని ట్రాఫిక్‌ను దాటించాడు. ఆ తర్వాత మళ్లీ రోడ్డుపై పెట్టి కూర్చొని హాయిగా వెళ్లిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాహనదారులు, ప్రజలు దీన్ని చూసి నవ్వుకున్న ఈ దృశ్యం.. ‘ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసిన లెజెండ్’, ‘నాకు రూల్స్ ముఖ్యం కాదు.. రూట్ ముఖ్యం’ అనే ఫన్నీ మీమ్స్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Leave a Reply