“రూ.57 లక్షల WFH బెటరా.. రూ.84 లక్షల బెంగళూరు జాబ్ బెటరా..?” మధురై ఐటీ ఉద్యోగికి వచ్చిన పెద్ద చిక్కు.. ఆఫర్ చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.. అసలు కథేంటంటే..??

రూ.57 లక్షల ప్యాకేజీతో ఇంటి నుంచే పనిచేసే (WFH) ఉద్యోగం ఉత్తమమా? లేక రూ.84 లక్షల ప్యాకేజీతో బెంగళూరుకు ప్రయాణం చేస్తూ చేసే ఉద్యోగం ఉత్తమమా? అంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

మధురైకి చెందిన ఈ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ప్రస్తుతం ఓ అమెరికన్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేస్తూ నెలకు చేతికి రూ.3.24 లక్షల జీతం అందుకుంటున్నారు. ఈ క్రమంలో మరో అమెరికన్ కంపెనీ ఆయనకు ఏడాదికి రూ.84 లక్షల వరకు ప్యాకేజీ ఇవ్వడానికి ముందుకొచ్చింది.

అయితే, ఈ భారీ జీతం ఇచ్చే ఉద్యోగంలో ఒక పెద్ద చిక్కు ఉంది. అదేంటంటే.. ఆయన వారానికి రెండు రోజులు బెంగళూరులోని ఆఫీసుకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. మధురైలో ఉన్న తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేని ఆయన, ప్రతి వారం రైలులో బెంగళూరుకు వెళ్లి రావాలని ప్లాన్ చేసుకున్నారు.

కానీ, వారానికి 20 గంటల పాటు రైలు ప్రయాణం చేయడం, నిద్ర లేకపోవడం వల్ల తన శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని భయపడి.. ఆయన ‘రెడిట్’ (Reddit) వేదికగా నెటిజన్ల సలహా కోరారు.

దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. ప్రయాణ ఖర్చులు, బెంగళూరులో వసతి (లాడ్జ్) అద్దెలు, శారీరక అలసట ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ అదనపు జీతం పెద్ద లాభమేమీ కాదని, ప్రశాంతమైన జీవితమే ముఖ్యమని సూచించారు. మరికొందరు మాత్రం, కేవలం ఒక్క ఏడాది పాటు కష్టపడి ఆ తర్వాత ఇదే హైక్‌తో మరో కంపెనీకి మారొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *