ఇంటర్నెట్లో రోజూ రకరకాల వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా, వాటిని చేసిన వారి తెలివితేటలను చూసి ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఆ కోవలోనే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఇళ్లలో తలుపులు వాటంతట అవే మూసుకోవడానికి ‘ఆటో డోర్ క్లోజర్’ (Auto Door Closer) అమర్చుతుంటారు. దీనికోసం కనీసం రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుంది. కానీ, ఆ ఖర్చేమీ లేకుండా ఓ వ్యక్తి పాత చెప్పును ఉపయోగించి అద్భుతమైన టెక్నిక్‌ను కనిపెట్టాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఓ వ్యక్తి పాత చెప్పును తీసుకుని తలుపుకు, దాని చెక్క ఫ్రేమ్‌కు మధ్యలో పెట్టి స్క్రూలతో బిగించాడు. ఆ తర్వాత తలుపును తెరిచి వదిలేస్తే, అది దానంతట అదే నెమ్మదిగా మూసుకుంటోంది.
ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆటో డోర్ క్లోజర్ పెడితే ఎలా పనిచేస్తుందో, ఈ చెప్పుతో చేసిన సెటప్ కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తోంది. కేవలం 100 రూపాయల చెప్పుతో వేల రూపాయల డబ్బు ఆదా చేసిన ఈ ఐడియా చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. “ఇది డోర్ క్లోజర్ కాదు, చెప్పు క్లోజర్” అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేయగా, “100 రూపాయల చెప్పును పాడు చేయడం అనవసరమైన పని” అని మరొకరు అభిప్రాయపడ్డారు.

Leave a Reply