కిడ్నీ (మూత్రపిండాల) సమస్యలు తలెత్తినప్పుడు మన శరీరం ఇచ్చే ముందస్తు హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కింద పేర్కొన్న లక్షణాలు మీలో కనిపిస్తే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
- నడుము కింది భాగంలో నొప్పి: నడుము కింది భాగంలో ఒకవైపు హఠాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం, దాంతో పాటు వికారం లేదా జ్వరం ఉంటే అది కిడ్నీ దెబ్బతిన్నదనడానికి ప్రధాన సంకేతం కావచ్చు. చాలామంది దీనిని సాధారణ నడుము నొప్పిగా భావించి వదిలేస్తుంటారు.
- ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: కేవలం గుండె సంబంధిత సమస్యలకే కాకుండా, కిడ్నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు కూడా ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతాయి.
- పొత్తికడుపులో నొప్పి: ఎలాంటి కారణం లేకుండా పొత్తికడుపులో నొప్పి, వికారం ఉంటే అది కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది.
- తలనొప్పి, తల తిరగడం: కిడ్నీలు రక్తపోటును (BP) నియంత్రించలేకపోయినప్పుడు, అధిక రక్తపోటు కారణంగా తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. దీనిని ప్రారంభంలోనే గుర్తించడం చాలా ముఖ్యం.
- కాళ్లు, పాదాల వాపు: కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలోని విషతుల్యాలు, వ్యర్థాలు బయటకు వెళ్లలేక లోపలే పేరుకుపోతాయి. దీనివల్ల కాళ్లు, పాదాలలో వాపు మరియు నొప్పి వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Leave a Reply