మహారాష్ట్రలోని ఓ అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “టీచర్.. మేమిప్పుడు పేదోళ్లమైపోయాం!” అంటూ ఆ చిన్నారి తన టీచర్‌తో చెప్పిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
పిల్లలు స్కూల్లో చేసే అల్లరి, వాళ్ల ముద్దుముద్దు మాటలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. అదే తరహాలో ఈ వీడియోలోని చిన్నారి కూడా తన టీచర్‌తో ఎలాంటి బెరుకు లేకుండా చాలా సహజంగా, సరదాగా మాట్లాడాడు.
ఇంతకీ పేదోళ్లమైపోయామని ఆ చిన్నారి ఎందుకు అన్నాడో తెలుసా?
“మేము పేదోళ్లమైపోయాం కాబట్టే డ్రాగన్ ఫ్రూట్, అరటిపండ్లు, ఆరెంజ్‌లు, యాపిల్స్ అన్నీ తింటున్నాం. మీలాగా టీ, బన్, బ్రెడ్ తినడానికి మేమేమీ ధనవంతులం కాదు!” అంటూ అమాయకంగా సమాధానం చెప్పాడు.
చిన్నారి చెప్పిన ఈ మాటలు విన్న టీచర్‌తో పాటు వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @chulbul_aganwadi అనే ఖాతాలో షేర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, వేలాది లైక్స్ వస్తున్నాయి.
చిన్నారి చెప్పిన ఈ రివర్స్ లాజిక్, అమాయకమైన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
“ఈ బాబు చాలా తెలివైనవాడు!”, “చిన్నోడు భలే మాట్లాడుతున్నాడు!”, “భవిష్యత్తులో పెద్దోడవుతాడు!” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి.. పెద్దల మాటల్లో కనిపించని అమాయకమైన హాస్యం పిల్లల మాటల్లో ఎలా ఉంటుందో ఈ చిన్నారి సమాధానం మరోసారి చూపించింది.

Leave a Reply