చెన్నైలోని ట్రిప్లికేన్ (తిరువల్లిక్కేణి) ప్రాంతంలో గంజాయి, మత్తుపదార్థాల విక్రయాలు, పాత కక్షల కారణంగా జరిగిన ఓ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అజిత్ అనే యువకుడిని లక్ష్యంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘గానా’ పాటలు పాడుతూ బెదిరింపులకు పాల్పడిన ఓ ముఠా, అతడి తల్లిదండ్రుల కళ్లెదుటే అజిత్‌ను అడ్డగించి రక్తపు మడుగులో పడేసి దారుణంగా హత్య చేసింది.
ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అజిత్ తల్లిని సైతం ఆ ఉన్మాద ముఠా విడిచిపెట్టకుండా, కత్తులతో విచక్షణారహితంగా నరికి అక్కడి నుంచి పరారైంది. కన్నతల్లి కళ్లెదుటే కొడుకుకు జరిగిన ఈ ఘోరం అక్కడి ప్రజలను, బంధువులను తీరని శోకంలో ముంచెత్తడమే కాకుండా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది.
ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడు రౌడీ హరీష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో రౌడీ ‘బోండా రాజేష్’ను కూడా పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, హత్యలో ప్రమేయమున్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply