“భార్యను పక్కనపెట్టి డాన్సర్‌తో జాలీగా..?” నెలకు రూ. 10 లక్షల జీతం… బ్యాంక్ ఖాతాలో రూ. 657 కోట్ల దోపిడీ. డాన్స్ చేసే ప్రియురాలికి కోట్లలో కుమ్మరించిన లూటీ.. సీబీఐనే బెదరగొట్టిన మెగా స్కామ్ లవ్ స్టోరీ..!!

ప్రభుత్వ ఖాతాల నుండి కోట్లాది రూపాయలు కాజేసి, ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విలాసవంతమైన ప్రేమ జీవితాన్ని గడిపిన ఒక ముఖ్య వ్యక్తి గురించిన నిజాలు ప్రస్తుతం సీబీఐ (CBI) విచారణలో వెలుగులోకి వచ్చాయి.

రూ. 657 కోట్ల బ్యాంక్ మోసాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ‘రిభవ్ రిషి’ అనే వ్యక్తి, ఒక నృత్య కళాకారిణిని (డాన్సర్‌ను) ప్రేమించి ఆమె కోసం విపరీతంగా ఖర్చు చేసిన డబ్బు గురించి ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

గత 2025లో చండీగఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ మహిళను చూసిన రిషి, ఆ తర్వాత జైపూర్, ముంబై వంటి ప్రాంతాలలో కలుస్తూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. తాను ఒక బ్యాంక్ మేనేజర్ మరియు వ్యాపారవేత్తనని అబద్ధం చెప్పిన అతను, తన భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ మహిళను నమ్మించాడు. అంతేకాకుండా, డాన్స్ ప్రోగ్రామ్‌లు చేయడం ఆపేసి తనను నమ్ముకుని రావాలని చెప్పి, ఆమెకు ప్రతినెల రూ. లక్షల్లో నజరానాలు ఇవ్వడం ప్రారంభించాడు.

గత 2025 ఆగస్టు నుండి 2026 జనవరి వరకు ఆ మహిళకు నెలకు రూ. 10 లక్షల వరకు ఇవ్వడంతో పాటు, ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో రూ. 3 కోట్లకు పైగా విలువైన ఒక ఇల్లు కూడా కొనిచ్చాడు. అంతేకాకుండా గోవా, మకావు, థాయిలాండ్ మరియు దుబాయ్ వంటి విదేశాలకు వరుసగా టూర్లు తీసుకెళ్లడమే కాకుండా, దుబాయ్‌‌లోని ప్రసిద్ధ ‘బర్జ్ అల్ అరబ్’ హోటల్‌లో లగ్జరీ స్టే మరియు విలాసవంతమైన కార్లను కూడా ఆమెకు కానుకగా ఇచ్చాడు.

చండీగఢ్‌లోని ఒక ఫామ్‌హౌస్‌‌లో హర్యానా ప్రభుత్వ అధికారులతో కలిసి రిషి ఘనంగా పార్టీలు నిర్వహించాడని, దీనికోసం మాత్రమే లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ ఖాతాల నుంచి నకిలీ లావాదేవీల (ఫేక్ ట్రాన్సాక్షన్లు) ద్వారా కోట్లాది రూపాయలను తన ఖాతాకు, తన భార్య ఖాతాకు మళ్లించి ఈ విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు సీబీఐ విచారణలో బయటపడింది.

ప్రభుత్వానికి చెందిన కోట్లాది రూపాయల సొమ్ముతో సాగిన ఈ సినిమా తరహా ప్రేమ, మోసం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించిన పలు ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, పరారీలో ఉన్న మరియు సంబంధం ఉన్న వ్యక్తులపై తీవ్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *