“గాల్లో వెళ్తున్న విమానంలో కత్తిపోట్లు. రక్తోడుతుండగానే పోరాడి 180 మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ ఏం చేశాడు? వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు.!!”

దుబాయ్ నుండి ఇస్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ‘ఫ్లైదుబాయ్’ (Flydubai) ప్రయాణికుల విమానంలో, కో-పైలట్ అకస్మాత్తుగా విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని కూల్చివేసేందుకు యత్నించగా, భారత్‌కు చెందిన క్యాప్టెన్ స్మిత్ మచార్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ ప్రమాదాన్ని తిప్పికొట్టిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.

జోర్డాన్ ఆకాశంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కో-పైలట్ చేసిన కత్తిపోట్లతో భారతీయ పైలట్ రక్తమడుగులో మునిగిపోయినప్పటికీ, అత్యంత సాహసంతో పోరాడి విమానాన్ని కాపాడారు.

విమానం అకస్మాత్తుగా 34,000 అడుగుల ఎత్తు నుండి కేవలం 30 సెకన్లలోనే 20,000 అడుగుల ఎత్తుకు రాకెట్‌లా నిలువుగా కిందకు పడిపోవడంతో ప్రయాణికులు భయంతో తీవ్రంగా కేకలు వేశారు.

వెంటనే విమాన సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో, సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (Emergecy Landing) చేశారు. విమానంలో ఉన్న దాదాపు 180 మంది ఇస్రాయెల్ ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

ఇది విమానం హైజాక్ యత్నం కాదని, కావలాలనే విమానాన్ని కూల్చేందుకు లేదా ఆత్మహత్య చేసుకునేందుకు చేసిన ప్రయత్నం కావచ్చునని ఇస్రాయెల్ అధికారులు, మీడియా సంస్థలు తెలిపాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ ఘటన విమానయాన రంగంలో తీవ్ర కలకలం రేపడంతో సంబంధిత అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.

భారత్‌కు చెందిన క్యాప్టెన్ స్మిత్ మచార్‌కు ఏవియేషన్ రంగంలో 13 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాల వల్లే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు క్షణాల్లో నిలిచాయి. ఆపద సమయంలో కొంచెం కూడా నిరత్సాహపడకుండా, చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *