భారతదేశంలో మంచి జీతంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి కెనడాకు వెళ్లిన ఒక యువకుడు, అక్కడ రాత్రి సమయంలో 12 గంటల పాటు బర్గర్ షాప్లో పనిచేస్తూ పడిన కష్టాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్గా మారింది.
కమాల్ నందా అనే ఆ వ్యక్తి, 2023లో కెనడాకు వెళ్లినప్పుడు గంటకు 16 డాలర్ల వేతనానికి ఒక రెస్టారెంట్లో పనిలో చేరాడు. ఒకరోజు మద్యం మత్తులో వచ్చిన ఒక కస్టమర్, ఆర్డర్ ఆలస్యమైందనే కారణంతో అతడిపై కూల్ డ్రింక్/జ్యూస్ పోసి అవమానించాడు.
ఆ అవమానమే అతని జీవితాన్ని మలుపు తిప్పే క్షణంగా మారింది. “మనం ఈ అవమానాలు పడటానికి ఇక్కడికి రాలేదు” అని తనకు తాను శపథం చేసుకున్న అతను, బర్గర్ షాప్లో పనిచేస్తూనే విరామ సమయంలో తీవ్రంగా వేరే ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు.
ఆ తర్వాత లభించిన ఒక పార్ట్-టైమ్ ఫ్రీలాన్స్ ఉద్యోగాన్ని అంగీకరించి, పగటిపూట ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొత్త ఉద్యోగం, రాత్రి వేళల్లో బర్గర్ షాప్లో పని చేస్తూ.. వరుసగా 7 నెలల పాటు నిద్ర లేకుండా కష్టపడి పనిచేశాడు.
అతని నిరంతర శ్రమతో నేడు కెనడాలో స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి, విలాసవంతమైన జీవితాన్ని గడిపే స్థాయికి ఎదిగాడు. “కష్టకాలంలో ఉన్నవారు దైర్యంగా ఉండండి, నిరాశపడకుండా రోజుకు కనీసం 1 గంట అయినా మీ నైపుణ్యాలను (Skills) పెంపొందించుకోవడానికి కేటాయించండి; కాలం ఖచ్చితంగా మారుతుంది” అని అతను సలహా ఇచ్చాడు.

Leave a Reply