పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా, సముద్రపు లోతుల్లో నీటి ప్రవాహ చక్రం (Water Circulation) మారిపోయి, సముద్రపు నీటికి ‘వయసైపోతోందని’ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు.
వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీరు వేడెక్కినప్పుడు, పై పొరలో ఉండే వెచ్చని నీరు, అడుగున ఉండే చల్లటి నీటితో కలవడం చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల సముద్రం అడుగు భాగానికి ఆక్సిజన్ చేరడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
సముద్ర ఉపరితలం పైకి రాకుండా చాలా ఏళ్లుగా అడుగుభాగంలోనే నిలిచిపోయిన నీటిని శాస్త్రవేత్తలు ‘పాత నీరు’ (Old Water) అని పిలుస్తున్నారు. ఇలా నీరు ఒకేచోట నిలిచిపోవడం వల్ల అందులో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోతున్నాయి.
ముఖ్యంగా ఉత్తర పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు దారుణంగా పడిపోతుండటంతో, అక్కడ నివసించే అరుదైన సముద్ర జీవుల మనుగడ తీవ్ర ప్రమాదంలో పడింది.
రాబోయే 100 ఏళ్లలో పసిఫిక్ మహాసముద్రంలో సంభవించబోయే ఈ భయంకరమైన మార్పులు, మొత్తం భూమండలానికి మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పరిశోధకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Leave a Reply