బ్రెజిల్ దేశంలోని ఓ జైలులో, ఒక ఖైదీ భోజనం పళ్లెం పెట్టేందుకు ఉండే అత్యంత చిన్న రంధ్రం గుండా తన శరీరాన్ని వంచి, మెలికలు తిప్పుతూ తప్పించుకున్న వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
శాంటా కాటరినా (Santa Catarina) ప్రాంతంలోని ఫ్లోరియానోపోలిస్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసులో అరెస్టై జైలులో ఉన్న వ్యక్తే ఈ విధంగా తప్పించుకున్నాడు.
జైలు తలుపుకు ఆహారం అందించడానికి ఏర్పాటు చేసిన ఆ చిన్న రంధ్రం గుండా, ఖైదీ ముందుగా తన తల, చేతులను బయటకు పెట్టి, ఆ తర్వాత కష్టపడి శరీరాన్ని వంచుతూ పూర్తిగా బయటకు వచ్చాడు.
బయటకు రాగానే తన చెప్పులు తీసుకుని ఏమీ జరగనట్లుగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డై ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. తీవ్ర గాలింపు చర్యలు చేపట్టి ఆ వ్యక్తిని మళ్లీ అరెస్టు చేశారు. అంతేకాకుండా, ఆ జైలు గదిని మూసివేసి, జైలులో అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Leave a Reply