“రక్తపు గాయాలు లేనంత మాత్రాన హత్యాయత్నం కాదా..?” తల్లీబిడ్డ క్షేమం.. కానీ గర్భిణీ కడుపుపై దాడి. కర్ణాటక హైకోర్టు సంధించిన సంచలన ప్రశ్న..!!

కర్ణాటకలో నిండు గర్భిణీ కడుపుపై దాడి చేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.

ఆ గర్భిణీకి ఎలాంటి పెద్ద గాయాలు లేదా రక్తస్రావం కాలేదని, ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చినందున హత్యాయత్నం సెక్షన్‌ను (కేసును) రద్దు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు.

కానీ, ఈ వాదనను అంగీకరించడానికి నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ అనంత్ రామనాథ్ హెగ్డే.. తీవ్రమైన గాయాలు కాలేదన్న ఒకే ఒక్క కారణంతో గర్భిణీ కడుపుపై చేసిన దాడిని హత్యాయత్నంగా పరిగణించలేమని చెప్పలేమని స్పష్టం చేశారు.

బాధితురాలు నిండు గర్భిణీగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగినందున, తల్లీబిడ్డలకు పెద్దగా హాని జరగలేదన్న ఒకే కారణంతో కేసును కొట్టివేయలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

దీంతో నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను కింది కోర్టు (విచారణ న్యాయస్థానం) పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకుంటుందని ఆదేశించింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *