మరణశిక్ష పడిన ఒక మహిళా ఖైదీకి శిక్షను అమలు చేస్తున్న సమయంలో ఎవరూ ఊహించని వింత సంఘటన చోటుచేసుకుంది.
గత 1995లో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలిన ‘క్రిస్టా పైక్’ (Christa Pike) అనే మహిళకు ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. దీంతో చట్టపరమైన విధానాల ప్రకారం, మొన్న ఆమెకు విషపు సూది (lethal injection) ఇచ్చి మరణశిక్షను అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు.
ఆమెకు మొదటిసారి విషపు సూది ఇచ్చిన తర్వాత, మూడు నిమిషాల వ్యవధిలో తెర తొలగించి చూడగా, ఆమె మూలుగుతూ, వెక్కిరిస్తూ శబ్దాలు చేసింది. ఇది చూసి షాక్ అయిన జైలు అధికారులు, వెంటనే తెరను మూసివేసి ఆమెకు మరోసారి విషపు సూది ఇచ్చారు. అయినప్పటికీ, చాలా నిమిషాలు గడిచినా ఆ మహిళా ఖైదీ ప్రాణాలు పోకపోవడంతో అధికారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
ఈ విచిత్రమైన మరియు ఊహించని పరిస్థితిని ఎలా అదుపు చేయాలో తెలియక అధికారులు, వెంటనే ఆమెను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. మరణశిక్ష పడిన ఖైదీకి విషపు సూది ఇచ్చినా ప్రాణాలు పోకుండా, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఈ సంఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది, అలాగే అంతర్జాతీయ మీడియాలో కూడా పతాక శీర్షికలకు ఎక్కింది.

Leave a Reply