కారులోంచి కిందకు దిగేందుకు డ్రైవర్ డోరు తెరిచినప్పుడు, ఎదురుగా వస్తున్న బైక్ అనుకోకుండా డోరును బలంగా ఢీకొనడంతో, ఆ కారు డోరే నేరుగా వెళ్లి డ్రైవర్ ముఖానికి బలంగా తగిలిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కారు ఆపిన డ్రైవర్, ఎదురుగా ఏదైనా వాహనం వస్తుందా అని గమనించకుండా నిర్లక్ష్యంగా ఒక్కసారిగా కారు డోరును అకస్మాత్తుగా తెరిచాడు.
సరిగ్గా అదే సమయంలో ఎదురు దిశలో ముందు నుంచి వస్తున్న ఒక బైక్, అనుకోకుండా తెరిచిన ఆ కారు డోరును చాలా బలంగా ఢీకొట్టింది.
బైక్ ఢీకొట్టిన ఆ వేగానికి, కారు డోరు భయంకరమైన వేగంతో వెనక్కి తిరిగి వచ్చి డ్రైవర్ ముఖంపైనే నేరుగా ‘పళార్’ మని కొట్టింది. దీంతో అతని ముఖానికి తీవ్ర గాయమై నొప్పితో విలవిలలాడాడు.
ఎదురుగా వస్తున్న బైక్ను గమనించకుండా డోరు తెరిచిన డ్రైవర్ చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం, అతనికే ప్రమాదంగా మారింది. ‘ఇకనైనా కారు దిగేటప్పుడు కొంచెం అటూఇటూ చూసి డోరు తెరవండయ్యా!’ ఈ ఘటన నేర్పుతున్న పాఠం.

Leave a Reply