“ఫోటో తీస్తున్నట్లు అంచున నిలబెట్టి తోసేసిన ప్రియురాలు!” చాట్‌జీపీటీలో వెతికి స్కెచ్ వేసి.. వాట్సాప్ చాట్‌తో దొరికిపోయిన దారుణం..!!!

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న లోహగడ్ (Lohagad) కోట లోయలో జారిపడి మరణించాడని భావించిన కేతన్ అగర్వాల్ అనే యువకుడి మృతి.. ప్రమాదం కాదు, అతని ప్రియురాలు సియా గోయల్, ఆమె అనుచరులు కలిసి పక్కా ప్రణాళికతో చేసిన దారుణ హత్య అని మహారాష్ట్ర పోలీసుల ఛార్జ్‌షీట్‌లో బట్టబయలైంది.

పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌లో, సియా గోయల్ తన అనుచరులైన చేతన్ చౌదరి, రితేష్ హంగేలతో కలిసి ఈ కుట్ర పన్నినట్లు తేలింది. 2026 మే 31నే లోహగడ్ ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రదేశాన్ని రెక్కీ చేసిన సియా, కేతన్‌ను లోయ అంచున నిలబెట్టి వివిధ కోణాల్లో ఫోటోలు తీసింది.

ఆ తర్వాత జూన్ 14న అతడిని కిందకు తోసేయడానికి ప్రయత్నించి విఫలమైన సియా, చివరగా జూన్ 18న డ్యామ్, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నట్లు కేతన్‌ను అంచున నిలబెట్టింది. ఫోటో యాంగిల్స్ సరిచూస్తున్నట్లు నటించి, వెనుక నుంచి వచ్చి అతడిని లోయలోకి తోసేసి దారుణంగా హత్య చేసింది.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇదొక ప్రమాదంగా నమ్మించేలా నాటకమాడిన నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి, డిలీట్ చేసిన 1,801 సంభాషణలను (చాట్స్) ఫోరెన్సిక్ నిపుణులు రికవర్ చేశారు. ఇందులో చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ సెర్చ్‌లు, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో హత్యకు వేసిన ప్రణాళిక, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేయడానికి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. డిజిటల్ ఆధారాలు, సీడీఆర్ (CDR) నివేదికలు, ఫోటోల ద్వారా ఈ కుట్ర పూర్తిగా రుజువు కావడంతో, కోర్టులో నిందితులపై విచారణ మరింత వేగవంతమైంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *