“ఒక అమ్మాయిని నడిరోడ్డుపై ఇలా అవమానిస్తావా.?” “కాలేజీకి నడిచి వెళ్తున్న విద్యార్థిని”.. వెనుక నుంచి వచ్చి తోసేసి చెంప చెళ్లుమనిపించిన యువకుడు. చోద్యం చూసిన జనం. షాకింగ్ వీడియో..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లాలో, కాలేజీకి వెళ్తున్న ఓ విద్యార్థిని పట్ల ఓ యువకుడు నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆ విద్యార్థినిని అడ్డగించి కిందకు తోసేసిన ఆ యువకుడు, జనం చూస్తుండగానే ఆమె చెంపపై బలంగా కొట్టాడు.

గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో, బుధానా ప్రాంతంలోని ఓ చిన్న మార్కెట్ వీధి గుండా ఆ విద్యార్థిని కాలేజీకి నడిచి వెళ్తోంది. ఆమె వెనుక మరికొందరు విద్యార్థినులు కూడా వస్తున్నారు. అప్పుడు నల్ల చొక్కా ధరించిన ఓ యువకుడు ఆ విద్యార్థినిని వెంబడిస్తూ వెళ్లాడు.

అకస్మాత్తుగా ఆ యువకుడు విద్యార్థిని దారికి అడ్డువచ్చి వేధించాడు. దీని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థినిని ఆ యువకుడు బలవంతంగా కిందకు తోసేశాడు. ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు శుక్రవారం విడుదలై ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తున్నాయి. 3 సెకన్ల నిడివి ఉన్న మొదటి వీడియోలో, మార్కెట్ వీధిలో విద్యార్థినులు నడిచి వెళ్తుండగా, వారి మధ్య నుంచి ఆ యువకుడు బాధితురాలిని వెంబడించి ఓ దుకాణం దగ్గర ఆమెను తోసేయడం స్పష్టంగా రికార్డైంది.

ఇక రెండో వీడియోలో.. ద్విచక్ర వాహనం ఆపి ఉన్న వీధిలో, ఆ యువకుడు తన దగ్గరకు వస్తుండటాన్ని ఆ విద్యార్థిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఏమాత్రం లెక్కచేయని ఆ యువకుడు, విద్యార్థిని చేయి పట్టుకుని లాగి ఆమె చెంపపై బలంగా కొట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ దారుణ ఘటనపై ఫిర్యాదులు రావడంతో, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిపై పోలీసు అధికారి లలిత్ కసానా మాట్లాడుతూ.. ‘ఈ వీడియో ఆధారాలు మా దృష్టికి వచ్చాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు కావడంతో ఆ రోజు పాఠశాలలు, కళాశాలలు మూసివేయడం వల్ల అదనపు వివరాలు సేకరించలేకపోయాము. అయినప్పటికీ, వీడియో దృశ్యాల ఆధారంగా ఆ యువకుడిని గుర్తించే పని ముమ్మరంగా కొనసాగుతోంది. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తాం’ అని తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *