ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు షాకింగ్ ఘటనలు ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం, ఆగ్రహం రేపాయి.
మొదటి ఘటనలో, ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలితో స్కూల్ మేనేజర్ దినేష్ రాయ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత పని ఉందని చెప్పి ఆమెను ఆపి, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఈ విషయం బయట చెబితే చంపి నదిలో పడేస్తానని బెదిరించాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడైన స్కూల్ మేనేజర్ దినేష్ రాయ్‌ను అరెస్టు చేసి తీవ్రంగా విచారిస్తున్నారు.
మరో ఘటనలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన 20 ఏళ్ల గిరిజన గర్భిణీకి రక్తహీనత (ఎనీమియా) సమస్య ఉందని చెబుతూ వైద్యులు అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆ మహిళ ఆసుపత్రి బయట ఉన్న రోడ్డుపైనే మహిళా బంధువుల సహాయంతో బిడ్డకు జన్మనివ్వాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటనపై జరిపిన విచారణలో, ఆమె ఓ నిర్దిష్ట గిరిజన వర్గానికి చెందినది కావడం వల్లే వైద్యులు, నర్సు ఆమెకు వైద్యం చేయడానికి నిరాకరించినట్లు తేలింది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 4 గురు వైద్యులు, ఒక నర్సుపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.

Leave a Reply