“అన్నా వద్దు, లోపలికి వచ్చేయ్..!” 43వ అంతస్తు బాల్కనీలో వేలాడిన యువకుడు.. ఏసీ మెకానిక్‌లు బతిమిలాడినా వినకుండా దూకి మృతి.. సెల్‌ఫోన్‌లో దొరికిన ఆధారం.. 22 ఏళ్ల యువకుడి దారుణ నిర్ణయం..!!

నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శనివారం ఉదయం 43వ అంతస్తు నుంచి 22 ఏళ్ల యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మరణించిన యువకుడిని వినయ్ కుమార్ జైన్ కుమారుడు సంభవ్ (Sambhav)గా గుర్తించారు.

ఇతను ఘటనకు ముందు రోజు, అంటే అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నమే ఈ 43వ అంతస్తు గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం 11:27 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బాల్కనీ పిట్టగోడ ఎక్కి బయటకు వేలాడుతూ నిల్చున్నాడు. ఇది చూసిన పక్క గదిలో ఏసీ మెకానిక్ పనులు చేస్తున్న సిబ్బంది, అతడిని రక్షించేందుకు ప్రయత్నించి అతడితో మాట్లాడారు.

ఏసీ మెకానిక్‌లు అతన్ని లోపలికి రావాలని ఎంత బతిమిలాడినా, తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో (డిప్రెషన్) ఉన్నానని, ఇక బతకాలని లేదని ఆ యువకుడు చెప్పాడు. ఆ మెకానిక్‌లు చూస్తుండగానే బాల్కనీ నుంచి పట్టు వదిలేసి 43వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. దీంతో అతను ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు.

సమాచారం అందుకున్న సెక్టార్ 126 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ యువకుడి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేయగా, ఆత్మహత్యకు ముందు అతను ఒక వీడియో రికార్డ్ చేసినట్లు తేలింది. అందులో తన ఆర్థిక ఇబ్బందులు, ఎదుర్కొన్న కష్టాల గురించి వివరిస్తూ, అందుకే తన ప్రాణాలు తీసుకుంటున్నట్లు మాట్లాడాడు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *