“భయంతో పరుగులు తీసిన విద్యార్థినులు..!” హాస్టల్ బాత్రూమ్ తలుపు తెరవగానే కనిపించిన దృశ్యం.. 10 అడుగుల భారీ కొండచిలువను పట్టుకునేందుకు తీవ్ర శ్రమ.. భయాందోళనలో ప్రజలు.. గుండెలు గుబేల్మనిపించే వీడియో..!!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సాగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా హాస్టల్‌లో అకస్మాత్తుగా 10 అడుగుల పొడవైన భారీ కొండచిలువ బాత్రూమ్‌లోకి ప్రవేశించిన ఘటన తీవ్ర కలకలం, భయాందోళనలను సృష్టించింది.

హాస్టల్ బాత్రూమ్‌కి వెళ్లిన విద్యార్థినులు, అక్కడ పడుకుని ఉన్న ఆ భారీ కొండచిలువను చూసి భయంతో కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. వెంటనే హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించగా, వారు అకీల్ బాబా అనే స్నేక్ క్యాచర్‌కు (పాములు పట్టే నిపుణుడికి) సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అకీల్ బాబా, భయంతో వణికిపోతున్న విద్యార్థినులకు ధైర్యం చెప్పి, బాత్రూమ్‌లో నక్కిన ఆ భారీ కొండచిలువను ఎంతో శ్రమించి చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ప్రాంతం కొండలకు సమీపంలో ఉండటం వల్ల, వర్షాకాలంలో పొడిగా ఉండే సురక్షిత ప్రదేశాల కోసం వెతుక్కుంటూ పాములు హాస్టల్స్ మరియు నివాస ప్రాంతాల్లోకి రావడం సహజమేనని అకీల్ బాబా తెలిపారు.

ఇప్పటివరకు ఆ ఒక్క ప్రాంతంలోనే సుమారు 70 నుంచి 75 కొండచిలువలను పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు చెప్పిన ఆయన.. ప్రజలు పాములను చూసినప్పుడు వాటిపై దాడి చేయకుండా, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *