భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి, భక్తి గీతాలు సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇందులో భాగంగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో నివసిస్తున్న చైనా సంతతికి చెందిన సారా జేన్ హో అనే తల్లి, తన నాలుగు నెలల బిడ్డను నిద్రపుచ్చడానికి ప్రతిరోజూ ‘హనుమాన్ చాలీసా’ పాడుతున్న ఒక మనసుని హత్తుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలై వైరల్గా మారింది.
సారా జేన్ హో పంచుకున్న ఆ వీడియోలో, ఆమె తన పసిబిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని అత్యంత మధురమైన స్వరంతో హనుమాన్ చాలీసా పాడుతున్నారు. అది విన్న ఆ 4 నెలల చిన్నారి, ఏడుపు ఆపేసి ప్రశాంతంగా మారి, కేవలం రెండే నిమిషాల్లో మెల్లగా కళ్లు మూసుకుని నిద్రపోతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు సైతం తమ ఆశ్చర్యాన్ని, ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.
దీని గురించి సారా జేన్ హో మాట్లాడుతూ.. “నా భారతీయ మిత్రుల ద్వారానే నాకు ఈ హనుమాన్ చాలీసా గొప్పదనం, అందులోని మాధుర్యం తెలిసింది. ఇది విన్నప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతత చేకూరినట్లు అనిపించింది. అందుకే నా బిడ్డను రోజూ నిద్రపుచ్చే సమయంలో కూడా ఈ చాలీసాను అలవాటు చేశాను. ఇది వినగానే పాప ఎలాంటి మారం చేయకుండా ప్రశాంతంగా నిద్రపోతుంది” అని ఆమె ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.

Leave a Reply