ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లేవారికి నెలకు కనీసం రూ. 1 లక్ష జీతం ఉండాలని ‘అత్రేయి’ అనే యువతి ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల, అక్కడ అమాంతం పెరిగిపోయిన ఇంటి అద్దెలపై ఆమె ఆ వీడియోలో మాట్లాడారు.
బెంగళూరులోని ఒక మంచి ప్రాంతంలో ఇల్లు కొనాలంటే కనీసం రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చవుతుందని, సొంత ఇల్లు కొనలేని వారు అద్దెకు ఉందామన్నా అక్కడ అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా, మంచి గేటెడ్ కమ్యూనిటీలు లేదా సొసైటీలలో 2 BHK ఫ్లాట్ అద్దె నెలకు రూ. 40,000 నుంచి రూ. 45,000 వరకు ఉంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు నెటిజన్లు బెంగళూరులో విపరీతంగా పెరిగిన ఖర్చుల వాస్తవాన్ని అంగీకరిస్తుండగా, మరికొందరు మాత్రం నగర నడిబొడ్డునే ఇల్లు తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదని, ప్రారంభంలో తక్కువ జీతం వచ్చేవారు శివారు ప్రాంతాల్లో ఉంటూ క్రమంగా ఎదుగుతూ స్థిరపడవచ్చని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Leave a Reply