“పెళ్లిలో ఊహించని ఉపద్రవం.. డైనింగ్ టేబుళ్లపై ఎక్కి అతిథులు చేసిన పనికి అంతా షాక్.. కూలిపోబోయిన పైకప్పు..!!”

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో, అనూహ్యంగా విరుచుకుపడిన తీవ్రమైన తుఫాను, వడగండ్ల వాన కారణంగా అతిథులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అక్టోబర్ 3న జరిగిన ఈ పెళ్లి వేడుక సందర్భంగా ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో, వేడుక జరుగుతున్న హాల్ పైకప్పుపై భారీగా నీరు, వడగండ్లు పేరుకుపోయాయి.

భారీ బరువు కారణంగా పైకప్పు క్రమంగా కిందకు వంగి కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో పెను ప్రమాదాన్ని నివారించేందుకు అతిథులు వెంటనే రంగంలోకి దిగారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న అతిథులు డైనింగ్ టేబుళ్లపైకి ఎక్కి నిలబడి, చెక్క కుర్చీలను తలపైకి ఎత్తిపట్టి పైకప్పు కూలిపోకుండా చేతులతో ఆపడానికి ప్రయత్నించారు.

టేబుళ్లపై ప్లేట్లు, గాజు గిన్నెలు ఉన్నప్పటికీ, పైకప్పును కాపాడే క్రమంలో ఆ వివాహ వేదిక కాస్తా ఒక రెస్క్యూ ఆపరేషన్ కేంద్రంగా మారిపోయింది. ఈ ఊహించని పరిణామం ఒకవైపు భయాన్ని కలిగించినప్పటికీ, ప్రమాదాన్ని తప్పించేందుకు అతిథులందరూ కలిసికట్టుగా స్పందించిన తీరు ఆకట్టుకుందని, నవ్వులు కూడా పూయించిందని అక్కడున్నవారు పేర్కొన్నారు.

ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో అత్యవసర సేవల సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. న్యూ సౌత్ వేల్స్ అత్యవసర విభాగానికి (SES) సహాయం కోసం 180కి పైగా అత్యవసర కాల్స్ రావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *