“అయ్యో ద్రోహీ..! ఇంత అన్యాయంగా నన్ను మోసం చేశావా..?” హోటల్‌లో గది బుక్ చేసిన భర్త.. రూమ్ నంబర్ 103లోకి మెరుపులా దూసుకెళ్లిన భార్య.. మరో మహిళతో పడకపై రెడ్ హ్యాండెడ్‌గా..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.!

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తన భర్తపై చాలా కాలంగా అనుమానం పెంచుకున్న ఓ వివాహిత, అతనికి తెలియకుండా మొబైల్ ఫోన్ తనిఖీ చేసి హోటల్ రూమ్ బుకింగ్ వివరాలను కనిపెట్టింది. ఆ వివరాల ఆధారంగా, చౌక్ ప్రాంతంలోని ‘బ్యాలెన్సింగ్ రాక్’ హోటల్‌కు తన బంధువులతో కలిసి ఆమె రహస్యంగా చేరుకుంది.

అక్కడ రూమ్ నంబర్ 103లో తన భర్త మరో మహిళతో ఏకాంతంగా ఉండటాన్ని చూసి భార్య తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అక్కడికక్కడే చితకబాదడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా గదిలోకి దూసుకొచ్చిన భార్య ఆవేశాన్ని చూసి భర్త, అతనితో ఉన్న సదరు మహిళ బిత్తరపోయి ఏం చేయాలో పాలుపోక ఉండిపోయారు. హోటల్ గదిలోనే సాగిన ఈ రభస, దాడితో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున గందరగోళం, అలజడి నెలకొంది.

భార్య వెంట వచ్చిన వారిలో ఒకరు ఈ తతంగాన్నంతా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భార్యాభర్తల మధ్య నమ్మకం లేకపోవడమే ఇలాంటి పరిణామాలకు కారణమని కొందరు అంటుండగా, మోసానికి పాల్పడిన భర్తను నడిరోడ్డుపై నిలదీయడం సరైన పనేనని మరికొందరు భార్యకు మద్దతు తెలుపుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని, గొడవను సద్దుమణిగించి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై భార్య అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *