నేటి డిజిటల్ యుగంలో పెన్ను పట్టి రాయడమే తగ్గిపోతున్న తరుణంలో, స్కూల్ యూనిఫాంలో కూర్చున్న ఒక చిన్నారి తన నోట్‌బుక్‌లో రాసిన చేతిరాతను చూసి యావత్ ఇంటర్నెట్ ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది.
అచ్చం కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ తీసిన ఫాంట్లాగా, ఒక్క అక్షరం కూడా వంకర లేకుండా అత్యంత చక్కగా, అందంగా ఆ బాలిక రాసిన నోట్‌బుక్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి.
ఆ వీడియోలో, స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక చిన్నారి తన క్లాస్రూమ్ బెంచీపై కూర్చుని ఎంతో ప్రశాంతంగా నోట్‌బుక్‌లో రాస్తూ కనిపిస్తోంది. కెమెరాను ఆ పుస్తకానికి దగ్గరగా పెట్టి చూసినప్పుడు, అందులోని ప్రతి అక్షరం ప్రింటింగ్ ప్రెస్‌లో అచ్చయిన పుస్తక పేజీలా అత్యంత కచ్చితత్వంతో ఉండటం కనిపిస్తుంది.
అక్షరాల మధ్య ఖాళీ, గీతల అమరిక, వంపులు అన్నీ కూడా కంప్యూటర్ టెక్నాలజీని మించిపోయేలా ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే కోట్లాది వ్యూస్‌ను సొంతం చేసుకుని విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలువురు.. “ఇది నిజంగా చేతితో రాసిందా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ప్రింట్ చేశారా?” అంటూ ఆశ్చర్యంతో కామెంట్లు పెడుతున్నారు.
అదే సమయంలో.. “కంప్యూటర్ స్క్రీన్లను, అందులోని ఫాంట్లను తలదన్నేలా ఉన్న ఈ చిన్నారి అసాధారణ చేతిరాత కేవలం రాత మాత్రమే కాదు, అదొక అద్భుతమైన కళాఖండం” అంటూ ఇంటర్నెట్ వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply