భారతదేశ ప్రముఖ టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్టెల్, తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను రూ.50 వరకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సరికొత్త ధరల పెంపు రేపటి నుంచే (అక్టోబర్ 8) దేశవ్యాప్తంగా అమల్లోకి రానుండటంతో, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లపై అదనపు భారం పడనుంది.
ఈ తాజా మార్పుల ప్రకారం, వ్యక్తిగత (ఇండివిడ్యువల్) పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇకపై రూ.499 నుంచి ప్రారంభం కానుండగా.. ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు సభ్యుల సంఖ్యను బట్టి రూ.749 నుంచి రూ.1,799 వరకు సవరించబడ్డాయి. అయితే, ఈ ధరల పెంపునకు బదులుగా వినియోగదారులకు ఏడాదికి ఒకసారి ఉచిత అంతర్జాతీయ రోమింగ్ (ఇంటర్నేషనల్ రోమింగ్) ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్టెల్ సంస్థ వెల్లడించింది.
ఎయిర్టెల్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని, ఎయిర్టెల్ బాటలోనే జియో, వొడాఫోన్ ఐడియా (Vi) వంటి ఇతర దిగ్గజ సంస్థలు కూడా త్వరలోనే తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తుండటంతో.. టెలికాం రంగంలో మరోసారి టారిఫ్ పెంపు పర్వం మొదలైనట్లయింది.

Leave a Reply