“ఆమెను చంపేశా..! నేనూ వెళ్లిపోతున్నా..” 7 రోజుల తర్వాత అడవిలో లభించిన మృతదేహం.. ప్రేమలో ఏం జరిగింది..? వెన్నులో వణుకు పుట్టించే ఘోరం.!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలిక హత్యకు గురైనట్లు వచ్చిన వార్త తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.

సెప్టెంబర్ 30వ తేదీన ఆ బాలిక హఠాత్తుగా అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ఆధారంగా, ఆమెతో పరిచయం ఉన్న 21 ఏళ్ల యువకుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బాలిక, యువకుడు పరస్పరం టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత, సదరు యువకుడి కాల్ డేటా రికార్డులు (CDR), మొబైల్ టవర్ లొకేషన్‌ను పోలీసులు పరిశీలించారు. ఆ ఆధారాలతో మలావార్ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ సుమారు 7 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

బాలికను హత్య చేశాడని భావిస్తున్న ఆ యువకుడు, అనంతరం లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టే ముందు అతడు తన ప్రేయసిని చంపేసినట్లు పేర్కొన్నట్లు సమాచారం అందింది. కాగా, అడవి నుంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దారుణ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికను ఎలా హత్య చేశారు? ఈ ఘాతుకానికి అసలు కారణమేంటి? యువకుడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న పూర్తి నేపథ్యం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొబైల్ కాల్ డేటా, టవర్ లొకేషన్ వివరాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ ముగిసిన తర్వాతే ఈ ఉదంతానికి సంబంధించిన అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: