“ఇంత పక్కాగా స్కెచ్ వేసి ముంచేశావా!” కారులో వచ్చి ఫోన్ మాట్లాడుతున్నట్లు నాటకం.. డీజిల్ కొట్టగానే కారుతో పరార్.. పెట్రోల్ బంకులో జరిగిన విస్తుపోయే మోసం.. వైరల్ సీసీటీవీ..!!

ఈ లోకంలో ఎంతటి స్వార్థపరులు, నీచమైన ఆలోచనలు ఉన్న మనుషులు ఉంటారనేదానికి నిదర్శనంగా ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది.

పెట్రోల్ బంకుకు కారులో వచ్చి డీజిల్ కొట్టించుకుని, డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి పరారైన ఒక మహిళ నిర్వాకం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

ఆ మహిళ తన కారులో పెట్రోల్ బంకుకు చేరుకుని డీజిల్ కొట్టాలని సిబ్బందికి చెప్పింది. కారు ఆపిన వెంటనే, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఎవరో ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ కిందకు దిగింది. సిబ్బంది దృష్టిని మరల్చేందుకే ఆమె ఈ నాటకానికి తెరలేపింది.

అనంతరం పెట్రోల్ బంక్ ఉద్యోగి కారులో డీజిల్ నింపడం ప్రారంభించగానే, ఆమె నెమ్మదిగా వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఉద్యోగి డీజిల్ కొట్టడం ఎప్పుడు ముగిస్తుందా అని వేచి చూసింది.

డీజిల్ కొట్టడం పూర్తయిన మరుక్షణమే, ఆ మహిళ ఏమాత్రం ఆలోచించకుండా కారును స్టార్ట్ చేసి వేగంగా అక్కడి నుంచి దూసుకెళ్లిపోయింది. దీంతో షాక్‌కు గురైన బంకు సిబ్బంది కేకలు వేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చినా, ఆ మహిళ కారును ఆపకుండా మెరుపు వేగంతో తప్పించుకుపోయింది.

కారులో డీజిల్ కొట్టించుకునే స్తోమత లేనివారు అసలు కార్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన ఉన్నవారు కళ్లెదుటే గొలుసుదొంగతనాలకు పాల్పడేందుకూ వెనుకాడరని, వీరికి చట్టమంటే ఏమాత్రం భయం లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు.


Posted

in

by

Tags: