“రూ.300 కాదు.. పూర్తి రూ.1,000 ఇస్తా! ఇంట్లోకి రా!” టాక్సీ డ్రైవర్‌కు ఓ మహిళ నుంచి ఎదురైన వింత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రయాణానికి చెల్లించాల్సిన డబ్బులు ఇచ్చే బదులు, అదనంగా డబ్బులు ఇస్తానంటూ ఇంట్లోకి రావాలని ఆమె కోరినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది.
ఆన్లైన్లో టాక్సీ బుక్ చేసుకుని ప్రయాణించిన ఓ మహిళ.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత డ్రైవర్‌కు చెల్లించాల్సిన అద్దె రూ.300. అయితే, ఆ మొత్తాన్ని ఇవ్వడానికి బదులుగా రూ.1,000 ఇస్తానని, ఇంట్లోకి రావాలని ఆమె చెప్పినట్లు వీడియోలో ఉన్నట్లు కథనం పేర్కొంది.
అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీసింది. ఇంటి దగ్గర కారు ఆపిన తర్వాత మహిళ కిందకు దిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. డ్రైవర్‌ను ఇంట్లోకి రావాలని కోరినట్లు సమాచారం.
అయితే, తనకు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదని, ప్రయాణానికి సంబంధించిన డబ్బులు మాత్రమే చెల్లించాలని డ్రైవర్ చెప్పినప్పటికీ.. రూ.300కు బదులుగా రూ.1,000 ఇస్తానంటూ ఆమె ఒత్తిడి చేసినట్లు కథనం వెల్లడించింది.
దీంతో ఏదైనా కుట్రలో చిక్కుకునే ప్రమాదం ఉందేమోనని భావించిన డ్రైవర్.. తన భద్రత కోసం జరిగిన సంఘటనను మొబైల్ ఫోన్లో వీడియోగా రికార్డ్ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారకముందే అతను అక్కడి నుంచి కారును తీసుకుని వెళ్లిపోయినట్లు కథనం పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ విధులు నిర్వహించే టాక్సీ డ్రైవర్లు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు ఈ ఘటన వెనుక అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి పూర్తిస్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.
