కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్, ఉరుగ్వే జట్ల మధ్య జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ (ఫ్రెండ్లీ) మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా స్టేడియంలోకి దూసుకొచ్చిన ఓ కోతి అభిమానిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
గ్యాలరీలో కూర్చుని ఆసక్తిగా మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని భుజంపై ఒక్కసారిగా ఓ కోతి దూకింది. రెప్పపాటు వ్యవధిలో అతని మెడపై కొరకడానికి ప్రయత్నించింది. భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి వెంటనే కోతిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, అది అతని మెడపై కరిచి అక్కడి నుంచి పారిపోయింది. ఈ భయానక దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
వేలాది మంది అభిమానులు ఉన్న అంతర్జాతీయ క్రీడా మైదానంలోకి కోతి అసలు ఎలా ప్రవేశించిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టేడియంలో కనీస భద్రతా ఏర్పాట్లు, లోపాలపై క్రీడాభిమానులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఉరుగ్వే జట్టు 6-1 గోల్స్ తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. మైదానంలో ఊహించని విధంగా జరిగిన ఈ కోతి దాడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Leave a Reply