స్నేహానికి, మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉత్తరప్రదేశ్లో కేవలం 25 వేల రూపాయల కోసం తన సొంత స్నేహితుడినే అత్యంత క్రూరంగా హత్య చేసిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉపాధి కోసం తన స్నేహితుడి దగ్గర షౌకీన్ అనే వ్యక్తి 25 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని స్నేహితుడు కోరడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
డబ్బు తిరిగి ఇవ్వలేకపోయిన ఆవేశంలో పథకం ప్రకారమే స్నేహితుడిని నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మందు తాగించి, ఆ తర్వాత బావిలో పదే పదే ముంచి దారుణంగా హత్య చేశారు.
మరుసటి రోజు బావిలో శవం పైకి తేలిపోతుందనే భయంతో, ఆ హంతకులు వెంటనే ఆ శవాన్ని బావిలో నుంచి బయటకు తీసి ఒక పొలంలో హడావుడిగా పూడ్చిపెట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, నిందితులలో ఒకరు ఇచ్చిన రహస్య సమాచారం ఆధారంగా పొలంలో పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply