అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (వైట్‌హౌస్) నూతన ప్రెస్ సెక్రటరీగా నియమితులైన కేటీ జఖారియా తన తొలి మీడియా సమావేశంలోనే చేసిన విచిత్రమైన తప్పిదం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జర్నలిస్టులను ఎదుర్కొన్న తొలిరోజే.. తన భర్త గురించి ప్రస్తావించే క్రమంలో పొరపాటున “మా అధ్యక్షుడు… క్షమించండి, నా భర్త” అంటూ తడబడుతూ మాట్లాడిన దృశ్యాలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టించాయి.
సాధారణంగా దాదాపు 45 నిమిషాల పాటు సాగే వైట్‌హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు భిన్నంగా, కేటీ జఖారియా మొదటి సమావేశం కేవలం 14 నిమిషాల్లోనే హడావుడిగా ముగిసింది. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబడిన ఆమె.. ముందే సిద్ధం చేసుకున్న నోట్స్ చూసి చదవడానికే ఎక్కువ సమయం వెచ్చించారు.
ఉక్రెయిన్ సంక్షోభం, ఇతర కీలక రాజకీయ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేక ఇబ్బందిపడిన ఆమె, ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోవడం అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలోని అధికారుల్లోనే తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.
కరోలిన్ లీవిట్ రాజీనామా అనంతరం భారీ అంచనాల నడుమ ఈ కీలక బాధ్యతలు చేపట్టిన కేటీ జఖారియా తొలి రోజే ఇలా తడబడటం.. వైట్‌హౌస్ మీడియా కమ్యూనికేషన్లలో డొల్లతనాన్ని బయటపెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“తొలిరోజే ఇంత పెద్ద తప్పిదమా?” అంటూ అమెరికన్ మీడియా ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. సోషల్ మీడియాలో ఈ 14 నిమిషాల వీడియో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply