ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు గాల్లోకి ఎగిరిపడి, అదే కారు పైకప్పు (రూఫ్) మీద పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారు, బైక్ ఒకదానికొకటి ఢీకొన్న సమయంలో.. అనూహ్యంగా ఆ యువకుడు గాల్లోకి లేచి పడిన భయానక దృశ్యాలు అందులో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఈ ఘటన బిలాస్‌పూర్‌లోని సర్కండా ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. రోడ్డుపై వేగంగా వచ్చిన కారు బైక్‌ను బలంగా గుద్దడంతో బైక్ తీవ్రంగా దెబ్బతింది. ఆ ఢీకొన్న ధాటికి బైక్‌పై ఉన్న యువకుడు నేరుగా కారు పైకప్పుపై వచ్చి పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
ఈ ప్రమాదంలో సమీర్ ఖాన్ (26) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారును మైనర్లు నడిపినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే, వాహనాన్ని అసలు ఎవరు నడిపారు? ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా తరచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలోనూ కారు వేగం, డ్రైవర్ వయసు కీలక అంశాలుగా మారాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.

Leave a Reply