“అయ్యో.. ఇలాంటి చావు రావాలా..!” ముగింపు గీతను తాకే క్షణంలో ఘోర విషాదం.. మారథాన్ పరుగులో 25 ఏళ్ల రన్నర్, ఇన్‌స్టా సెలబ్రిటీ హఠాన్మరణం.. దిగ్భ్రాంతిలో నెటిజన్లు..!!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రన్నర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యూ జీ-వోన్ (Yoo Ji-won) గత ఆదివారం జరిగిన హాఫ్ మారథాన్ ముగింపు దశలో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె, తన అథ్లెటిక్స్ విజయాలు, రన్నింగ్ ప్రాక్టీస్ వీడియోలను నిరంతరం పంచుకోవడంతో పాటు, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలో రీసెర్చర్‌గా కూడా పనిచేస్తున్నారు.

సియోల్ నగరంలో నిర్వహించిన ఆ మారథాన్ పోటీలో ఫినిషింగ్ లైన్‌కు చేరుకుంటున్న సమయంలో ఆమె ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక ఆమె కన్నుమూసినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

పోటీ ముగిసిన తర్వాత అవార్డుల వేదిక వద్ద తన స్నేహితురాలి కోసం వెతికానని, కానీ అంతలోనే ఆసుపత్రి నుంచి వచ్చిన ఈ పిడుగులాంటి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె తోటి రన్నర్ కన్నీటి పర్యంతమవుతూ పోస్ట్ చేశారు.

చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రతిభావంతురాలైన అథ్లెట్ ఆకస్మిక మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు, స్నేహితులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కన్నీటి నివాళులర్పిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *