“లండన్ వీధుల్లో సృహతప్పి పడిపోయిన యువరాణి!”.. 3 ఏళ్ల చిన్నారిని గాలికొదిలేసి మత్తులో జోగుతూ!.. మండిపడుతున్న నెటిజన్లు..!!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబి రాజకుటుంబానికి చెందిన మహ్రా అల్ నహ్యాన్ (32) అనే మహిళ, మితిమీరిన డ్రగ్స్ (మాదకద్రవ్యాల) వాడకం వల్ల లండన్ నగరంలోని రద్దీగా ఉండే రోడ్డుపై సృహతప్పి పడిపోయిన దారుణ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.

కోట్లాది రూపాయల ఆస్తులు, రాజకుటుంబ హోదా ఉన్నప్పటికీ, కేవలం 3 ఏళ్ల పసిబిడ్డను కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రమాదకరమైన రోడ్డుపై ఒంటరిగా వదిలేసి ఆమె నడిరోడ్డుపై కుప్పకూలిపోయిన దృశ్యం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

లండన్ వీధుల్లో సృహతప్పి పడి ఉన్న ఆ రాజకుటుంబీకురాలిని చూసిన స్థానికులు, ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే వేగంగా వెళ్తున్న వాహనాల కింద పడకుండా ఆ చిన్నారిని సురక్షితంగా కాపాడారు.

మాదకద్రవ్యాల వ్యసనానికి బానిస కావడం వల్ల ఏర్పడిన తీవ్రమైన అలసట, మత్తు కారణంగా అరగంటకు పైగా స్పృహ లేకుండా నేలపై పడి ఉన్న ఆ మహిళ.. సృహ వచ్చిన తర్వాత కూడా తన తప్పును తెలుసుకోకుండా స్థానికులతో వాగ్వాదానికి దిగడం అక్కడివారిని తీవ్ర విస్మయానికి గురిచేసింది.

ఈ వ్యవహారం లండన్ సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టుకు చేరగా, పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిందన్న ఆరోపణలను ఆ మహిళ అంగీకరించింది. ప్రాణాపాయ స్థితిలో చిన్నారిని రోడ్డుపై వదిలేసినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించిన న్యాయమూర్తి, పునరావాస కేంద్రంలో (రిహాబ్ సెంటర్‌లో) చికిత్స పొందాలని ఆదేశించడంతో పాటు జరిమానా కూడా విధించి తీర్పునిచ్చారు.

మాదకద్రవ్యాలనే క్రూరమైన వ్యసనం మనుషుల బాధ్యతను, మాతృత్వపు మమకారాన్ని ఎంతలా దిగజారుస్తుందో చెప్పడానికి రాజకుటుంబానికి చెందిన ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *