“ప్రైవేట్ వీడియోలను భర్తకు పంపిన వ్యవహారం..!” మాజీ ప్రియుడిని కత్తెరతో విచక్షణారహితంగా పొడిచిన మహిళ.. ఉలిక్కిపడేలా చేసిన షాకింగ్ ఘటన..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ ప్రాంతంలో, తన మాజీ ప్రియుడు తమ ప్రైవేట్ (ఏకాంత) వీడియోలను తన భర్తకు పంపడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ.. వంటగదిలో వాడే కత్తెరతో అతడిని విచక్షణారహితంగా పొడిచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

గ్వాలియర్ లలిత్‌పూర్ కాలనీలో నివసిస్తున్న ధర్మేంద్ర ప్రజాపతి (40), అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఆ మహిళ అతనితో విడిపోయి వేరొకరిని వివాహం చేసుకుంది.

వివాహం జరిగిన తర్వాత కూడా ధర్మేంద్ర ఆమెను నిరంతరం వేధించడంతో పాటు, వారిద్దరి మధ్య ఉన్న పాత ప్రైవేట్ ఆడియోలు, వీడియోలను ఆ మహిళ భర్తకు పంపించాడు.

దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవలు చెలరేగాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ.. నేరుగా ధర్మేంద్ర ఇంటికి వెళ్లి అతనితో వాగ్వాదానికి దిగి, కత్తెరతో పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచింది.

రక్తపు మడుగులో కుప్పకూలిన ధర్మేంద్రను చుట్టుపక్కల వారు రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళను అరెస్టు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *