స్నేహితుడేనని నమ్మి ఇంటికి రానివ్వడమే తప్పయింది.! నా భార్యపై కన్నేశారు.. 4 ఏళ్ల కొడుకును చంపేస్తామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులు..!!

మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో, స్నేహితుడి 4 ఏళ్ల కుమారుడిని చంపేస్తామని బెదిరించి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది.

పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త, నాలుగేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది. వీరి ఇంటికి భర్త స్నేహితులైన సూరజ్ యాదవ్, విశాల్ తరచూ వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ మహిళపై వారిద్దరికీ దుర్బుద్ధి పుట్టింది.

గత అక్టోబర్ 8న, సదరు మహిళ భర్త పని నిమిత్తం బయటకు వెళ్లాడు. దీంతో ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంది. దీనిని అదనుగా చూసుకున్న భర్త స్నేహితులిద్దరూ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు.

ఇంట్లోకి చొరబడిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె వారిని అడ్డుకుని ప్రతిఘటించగా, ఆమె నాలుగేళ్ల కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. కన్నబిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి వేరే దారిలేక ప్రాణభయంతో వణికిపోయిన ఆ మహిళపై ఇద్దరూ కలిసి అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.

బయటకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాగానే, జరిగిన ఘోరాన్ని చెప్పి ఆ మహిళ కన్నీరుమున్నీరైంది. అనంతరం బాధిత మహిళ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్త స్నేహితులు సూరజ్ యాదవ్, విశాల్ ఇద్దరినీ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి, వారిని కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *