చర్చిలో ఇలాంటి ఘోరమా..? ప్రార్థనలో ఉన్న పాస్టర్.. కనురెప్పపాటులో కూలిపడ్డ భారీ శిలువ.. క్షణాల్లో అక్కడికక్కడే దుర్మరణం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లోని ఓ చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా, ఒక్కసారిగా భారీ శిలువ విరిగిపడి పాస్టర్ దుర్మరణం పాలయ్యారు.

ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఈక్వెడార్‌లోని గ్వాయాకిల్ నగరంలో ఉన్న ‘నుయెస్ట్రా సెనోరా డెల్ పెర్పెటువో సోకోరో’ చర్చిలో శనివారం సాధారణ ప్రార్థనా కార్యక్రమం జరిగింది. చర్చి పాస్టర్ ఫాదర్ పాట్రిసియో అల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) కూడా చేశారు.

ప్రార్థన కొనసాగుతుండగానే, పాస్టర్ వెనుక ఉన్న గోడకు బిగించిన భారీ చెక్క శిలువ అకస్మాత్తుగా ఊడిపోయి, పెద్ద శబ్దంతో నేరుగా ఆయనపై పడింది. ఆ శిలువ పడిన వేగానికి పాస్టర్ కిందపడిపోయి కెమెరా ఫ్రేమ్ నుంచి కనిపించకుండా పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఆదివారం నాడు గ్వాయాకిల్ ఆర్చ్‌డయోసెస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. ఫాదర్ పాట్రిసియో అల్ఫ్రెడో సాంచెజ్ మోలినారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చర్చి యాజమాన్యం ప్రార్థించింది. దివంగత పాస్టర్ ‘కాంగ్రిగేషన్ ఆఫ్ ది మోస్ట్ హోలీ రిడీమర్’ అనే కాథలిక్ సంస్థలో సభ్యుడిగా కూడా సేవలందించినట్లు సమాచారం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *