సన్ నెట్వర్క్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సహ యజమానురాలు అయిన కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడైన అనిరుధ్ రవిచందర్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు అందించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట వివాహం గ్రీస్ దేశంలో అత్యంత విలాసవంతంగా జరగనుండగా, రిసెప్షన్ వేడుక నవంబర్ 21, 2026న జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇరు కుటుంబాల పెద్దలు కలిసి దేశంలోని పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.
కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేసి, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆమె వద్ద దాదాపు రూ. 10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు బెంట్లీ, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు రూ. 409 కోట్లుగా అంచనా వేయగా, దాదాపు రూ. 25,000 కోట్ల విలువైన సన్ గ్రూప్‌తో పాటు రూ. 18,000 కోట్ల విలువైన ఐపీఎల్ జట్టుకు కూడా ఆమె ఏకైక వారసురాలిగా ఉన్నారు.
మరోవైపు, భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల్లో ఒకరైన అనిరుధ్, ఒక్కో చిత్రానికి రూ. 8 నుండి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సంగీత రంగంతో పాటు స్టార్టప్‌లు, బ్రాండ్ ఎండార్స్మెంట్లలోనూ పెట్టుబడులు పెట్టిన అనిరుధ్ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కోలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరుగాంచిన అనిరుధ్, కావ్య మారన్ల పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply