“తిండికి దారి లేక ఊళ్లపై పడ్డాయి!” – మనుషులను వేటాడుతున్న అడవి ఎలుగుబంట్లు! రష్యాలో రేగిన అతిపెద్ద సంక్షోభం!

రష్యాలోని మంచు ప్రాంతమైన సైబీరియాలో అడవి ఎలుగుబంట్ల విధ్వంసం రోజురోజుకీ పెరుగుతూ తీవ్ర మానవ వినాశనానికి దారితీస్తోంది.

ఆహారం కోసం మానవ ఆవాసాలలోకి చొరబడుతున్న ఈ క్రూర ఎలుగుబంట్లు, కంటపడిన మనుషులపై దాడి చేసి సజీవంగా కొరికి తింటున్న సంఘటనలు నిరంతరం కొనసాగుతున్నాయి.

గడిచిన ఒక్క నెలలోనే ఎలుగుబంట్ల క్రూర దాడికి గురై 7 గురు దారుణంగా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించింది. సైబీరియా ప్రాంతంలో ఇప్పటివరకు ఎలుగుబంట్లు జరిపిన దాడుల్లో మొత్తం 22 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అడవుల్లో తీవ్ర ఆహార కొరత ఏర్పడటమే ఎలుగుబంట్లు మానవ నివాసాలపై దండయాత్ర చేయడానికి కారణమని చెబుతున్నారు. ఎలుగుబంట్లు ఎటువంటి ఆటంకం లేకుండా గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను వేటాడుతుండటంతో, సామాన్య ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యే దయనీయ పరిస్థితి నెలకొంది.

ఈ వరుస దాడులు, మరణాలను అరికట్టడంలో విఫలమైనందుకు గాను రష్యా పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులపై ప్రస్తుతం కేసు నమోదు చేయబడింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇన్ని మానవ ప్రాణాలు పోవడానికి కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సంచలన చర్య తీసుకున్నారు.

అంతేకాకుండా పరిస్థితి చేయి దాటిపోవడంతో, నివాస ప్రాంతాల్లోకి చొరబడి ప్రమాదం కలిగిస్తున్న ఎలుగుబంట్లను కాల్చివేసేందుకు వేటగాళ్లకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. సైబీరియాలో జరుగుతున్న ఈ మానవ-వన్యప్రాణి సంఘర్షణ రష్యా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *