రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, వివిధ చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన కొత్త నిబంధనను ప్రకటించింది. దీని ప్రకారం, రానున్న 2027 జనవరి 1వ తేదీ నుంచి సెల్‌ఫోన్లలో సిమ్ కార్డు తీసేసి, కేవలம் వై-ఫై (Wi-Fi) సదుపాయంతో మాత్రమే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లను వాడటంపై నిషేధం విధించనున్నారు.
ప్రస్తుతం చాలా మంది తమ ఫోన్ల నుంచి సిమ్ కార్డులను తొలగించి, బహిరంగ ప్రదేశాల్లోని వై-ఫై లేదా ఇతర వై-ఫై కనెక్షన్ల ద్వారా మాత్రమే ఇలాంటి యాప్‌లను వాడుతూ రకరకాల మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, నేరస్థులను సులభంగా గుర్తించేందుకు కేంద్ర టెలికాం శాఖ (DoT) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం, ఆ తేదీ నుంచి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లలో సిమ్ కార్డు లేకుండా పైన పేర్కొన్న యాప్‌లను వాడలేరు. ఆ యాప్‌లు పనిచేయాలంటే ఫోన్‌లో సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం టెక్నాలజీ రంగంలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీయడంతో పాటు సాధారణ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

Leave a Reply