“నొప్పి భరించలేకపోతున్నా.. దయచేసి ఆసుపత్రికి తీసుకెళ్లండి!” విలపించిన గర్భిణి భార్య.. గూగుల్‌లో వెతికి, తల్లి, సోదరితో కలిసి భార్య కాళ్లూ చేతులూ కట్టేసి, నోట్లో విషం పోసి కిటికీకి వేలాడదీసిన కసాయి భర్త..!!

గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లా మహుధా తాలూకాలో అనుమానంతో 13 వారాల గర్భిణి అయిన భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

అరుణాబెన్ సోధా (13 వారాల గర్భిణి) అనే మహిళ తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని వేడుకున్నప్పటికీ భర్త మిథుల్ సోధా ఏమాత్రం పట్టించుకోలేదు.

నొప్పి భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్య చెప్పడంతో, భర్త వెంటనే గూగుల్‌లో “భార్య ఆత్మహత్య చేసుకుంటే భర్తకు శిక్ష పడుతుందా?” అని వెతికాడు. ఆ తర్వాత పథకం ప్రకారం భర్త మిథుల్ తన తల్లి (ఆమె అత్త), సోదరి (ఆడపడుచు) సహాయంతో గర్భిణి కాళ్లూ చేతులూ కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, ‘నానో యూరియా’ అనే విష రసాయనాన్ని ఆమె నోట్లో బలవంతంగా పోశారు. దీంతో ఊపిరాడక అరుణాబెన్, ఆమె కడుపులోని శిశువు ప్రాణాలు కోల్పోయారు.

ఈ హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఆమె మృతదేహాన్ని నైలాన్ తాడుతో కిటికీకి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని తేలిపోయింది. దీంతో భర్త మిథుల్, అతడి సోదరుడు విపుల్ సోధాలను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అత్త, ఆడపడుచుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *